స్వల్పంగా పెరిగిన బంగారం..ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

స్వల్పంగా పెరిగిన బంగారం..ఎంతంటే?

April 9, 2022

gngn

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య గతకొన్ని రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా బంగారం ధర విపరీతంగా కొండెక్కింది. బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి నిరాశ ఎదురవుతోంది. కొన్ని రోజులు తగ్గి, కొన్ని రోజులు పెరుగుతున్నా యుద్ధం ముందున్న పరిస్థితితో పోలిస్తే భారీ పెరుగుదలే నమోదవుతోంది.  రూ. 55వేలు ఉన్న ధర భారీగానే తగ్గి 48, 49 వేల మధ్య కదలాడుతోంది.

నిన్నటి బంగారం ధరతో పోలిస్తే, 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 350 పెరిగి, రూ. 48,950కి చేరింది. ఇక, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం, పది గ్రాముల ధర రూ. 390 పెరిగింది. దాంతో తులం బంగారం రూ. 53,020కి చేరింది. వెండి ధర కిలోకు రూ. 200 తగ్గి రూ. 71,500కి చేరింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్టణంలోనూ ఇవే ధరలు ఉన్నాయి.