Slightly reduced corona cases in India..new cases ..
mictv telugu

భారత్‌లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..కొత్త కేసులు..

July 1, 2022

భారతదేశంలో గతకొన్ని రోజులుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మళ్లీ అప్రమత్తమైయ్యాయి. ప్రజలు ఎక్కడికెళ్లిన మాస్కు, శానిటైజేషన్, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో కరోనా కొత్త కేసుల స్వల్పంగా తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నాయి.

కరోనా కొత్త కేసులుకు సంబంధించిన బులెటెన్‌ను శుక్రవారం విడుల చేశారు. విడుదల చేసిన బులెటెన్‌లో..” గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 23 మంది కరోనాకు బలియ్యారు. కోవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,07,189 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 3.40 శాతంగా ఉంది.”

ఇక, గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు 17,070 కేసులు నిర్థారణ అయ్యాయి. అంటే స్వల్పంగా కేసుల సంఖ్య తగ్గింది. ఇప్పటివరకు ఇండియాలో 4,34,69,234 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 4,28,36,906 మంది కోలుకోగా, 5,25,139 మంది మరణించారు. ప్రస్తుతం ఇండియాలో రికవరీ రేటు 98.55 శాతంగా ఉంది. మరణాల రేట్ 1.21 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 197,74,71,041 మంది కరోనా టీకా తీసుకున్నారు అని వివరాలను వెల్లడించారు.