చంద్రబాబు మాట్లాడుతుండగా చెప్పు విసిరాడు..
Editor | 2 March 2019 11:39 AM GMT
రాజకీయ విభేదాలు కోడిగుడ్లు, టమోటాలు, చెప్పు దాడులకు దారితీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సభలో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి వేదికపైకి చెప్పు విసిరాడు. కర్నూలు జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి టీడీపీలో చేరిన సందర్భంగా ఈ సభ నిర్వహించారు.
చంద్రబాబు మాట్లాడుతుండగా వేదికపై చెప్పు వచ్చి పడింది. అయితే అది నేతలకు దూరంగా వేదిక టేబుల్ వద్ద పడిపోయింది. అప్రమత్తమైన భద్రతాసిబ్బంది ఆ చెప్పును తీసేయగా, సభ నిరాటంకంగా సాగింది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వ్యతిరేక వర్గం వారే చెప్పు విసిరేయించినట్లు తెలుస్తోంది.
Updated : 2 March 2019 11:40 AM GMT
Tags: Andhra Pradesh CM chandrababu naidu kotla suryaprakash reddy Kurnool meeting political issue Slipper attack
Next Story
© 2017 - 2018 Copyright Telugu News - Mic tv. All Rights reserved.
Designed by Hocalwire