Small children..Peddasayam: Video goes viral
mictv telugu

చిన్న పిల్లలు..పెద్దసాయం: వీడియో వైరల్

August 10, 2022

సామాన్యంగా చిన్న పిల్లలంటే బడికి వెళ్లటం, ఇంటి రాగానే టీచర్లు ఇచ్చిన హూంవర్క్‌ను చేయటం, ఆ తర్వాత కొద్దిసేపు ఆటలు ఆడి నిద్రపోవటం మాత్రమే మనందరికి తెలిసిన విషయం. కానీ, ఆ చిన్న పిల్లల్లో కూడా పెద్ద మనసు ఉంటుందనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే వాళ్లు చిన్న పిల్లలు కదా వారికి పెద్ద పెద్ద విషయాలెమీ తెలియవని కొంతమంది పెద్దలు అంటుంటారు. కానీ, ఈ వీడియోను చూస్తే, ఆ ఆలోచనలు నిజము కాదని అనిపిస్తుంది.

వీడియోలో..”రోడ్డుపై ఓ మహిళ తోపుడు బండిపై పండ్ల వ్యాపారం చేస్తూ, జీవనం సాగిస్తుంది. బండిని త్రోసుకుంటూ వెళ్తున్న ఆ మహిళకు ఓ ఎత్తుగడ్డ ఎదురైంది. దాంతో ఆ మహిళ ఆ బండిని ఎక్కించటం కోసం పదే పేద ప్రయత్నిస్తుంది. అటుగా వెళ్తున్నవారు చూసిచూడనట్లుగా వెళ్లిపోతున్నారు తప్ప సాయం చేయటం లేదు. ఇంతలోనే నిండా పదేళ్లు కూడా లేని ఓ చిన్నారులు బండి ఎదురుగా వచ్చి సాయం చేశారు. వారి చిట్టిచేతులతో ఆ మనిషి కష్టం తీర్చారు. ఆ తర్వాత ఆ మహిళ ఆ పిల్లల చేసిన సాయాన్ని చిరునవ్వుతో స్వాగతిస్తూ, వారికి రెండు అరటిపండ్లను ఇచ్చింది”.

అయితే, ఈ వీడియోను వీక్షిస్తున్న వారంతా ‘సాయం చేయాలనే ఆలోచన ఉండాలే గానీ, వయసుతో పనేముంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆదిత్యనాథ్ అనే నెటిజన్ ట్విటర్‌లో షేర్ చేస్తూ..”మీరు సాధించిన డిగ్రీలు మీ ప్రవర్తనలో కన్పించకపోతే అవి కేవలం చిత్తు కాగితాలు మాత్రమే” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.