తూర్పుగోదావరిలో వింత.. బుల్లి దూడకు జన్మనిచ్చిన ఆవు  - MicTv.in - Telugu News
mictv telugu

తూర్పుగోదావరిలో వింత.. బుల్లి దూడకు జన్మనిచ్చిన ఆవు 

October 29, 2019

cow...

తూర్పుగోదావరి జిల్లాలో వింత ఘటన చోటు చేసుకుంది. ఆలమూరు మండలం గుమ్మిలేరులో ఓ ఆవు బుల్లి దూడకు జన్మనిచ్చింది. అత్యంత చిన్నగా ఉండే ఈ దూడను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీని ఎత్తు, పొడవు సాధారణ దూడల కంటే చాలా తక్కువగా ఉంది. 15.6 అంగుళాలఎత్తు, 22 అంగుళాల పొడవు మాత్రమే ఉంది. 

ముత్యాల వీరభాస్కరరావుకు చెందిన ఒంగోలు ఆవుకు ఈ దూడ పుట్టింది. దీన్ని చూసేందుకు చాలా మంది అతని పాక వద్దకు తరలివస్తున్నారు. ఇప్పటి వరకు ఇంత చిన్న దూడ పుట్టడం అరుదని పశుసంవర్థకశాఖ ఏడీ డా. రామకృష్ణ తెలిపారు. జన్యుపరమైన లోపాల వల్లే దూడ ఎదగకపోవడంతో ఇలా జరిగి ఉంటుందని అంటున్నారు. మొత్తానికి ఈ బుల్లి ఆవు దూడ ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తోంది.