పిల్లల్ను కూడా ఫిదా జేసిన కార్తీక..! - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లల్ను కూడా ఫిదా జేసిన కార్తీక..!

September 2, 2017

బిగ్ బాస్ హౌస్ లో పాల్గొన్న కత్తి కార్తీక, ఆ హౌస్ లో ఉన్న వాళ్ల మనసులే కాదు , చూస్తున్న ప్రేక్షకుల మనసులు కూడా గెలుచుకుంది. బిగ్ హౌస్ నుంచి కత్తి కార్తీకను ఎందుకు ఎలిమినేట్ చేసారన్నది చాలామందికి ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. చివరిదాకా ఉంటే కచ్చితంగా ప్రైజ్ మనీ కత్తి కార్తీకకే వచ్చేదని కొందరి వాదన. బిగ్ బాస్ హౌస్ లో పక్కా తెలంగాణ యాసలో మాట్లాడుతూ అందరికంటే బాగా ఆడింది కత్తి కార్తీక మాత్రమే అని చాలా మంది ఆమెను ప్రశంసించారు.

అయితే కార్తీకను పెద్దలే కాదు, చిన్న పిల్లలు కూడా ఇష్ట పడుతున్నారు. ఈ వీడియోలో బిగ్ బాస్ లో నీకిష్టమైన వాళ్లు ఎవరని ఓ బుజ్జిని అడుగ్గా.. ‘కత్తి కార్తీక అంటే ఇష్టం. ఎందుకంటే ఆమె నైస్’ అని ఆ చిన్న బుజ్జి చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా బిగ్ బాస్ షో ద్వారా కత్తి కార్తీక అన్ని వయసు వాళ్ల మనసు గెల్చుకుంది.