small plane crashes into Orlando highway and skids onto a driveway
mictv telugu

కారుపై దూసుకొస్తూ విమానం ఢమాల్.. పైలెట్ ఏమయ్యాడంటే..

August 22, 2022

small plane crashes into Orlando highway and skids onto a driveway

కొన్ని ప్రమాదాలు ఏమాత్రం ఊహించని విధంగా జరుగుతున్నాయి. బైక్, కారు, రైలు, విమానం.. ఏదైనా సరే టైమ్ బాలేకపోతే ఢమాలే. వీటిలో విమాన ప్రమాదాలు మరింత వెరైటీ. సముద్రాలపై కూలిపోయేవి కొన్నయితే, కొండలపై, చెట్లపై కూలేవి మరికొన్ని. చెట్లపై కూలి వేలాడేవి మరికొన్ని. చిన్న విమానాలు మరీ ఘోరం. ఎక్కడబడితే అక్కడ కూలిపోతుంటాయి. అమెరికాలోని ఓర్లాండోలో ఓ హైవేపై అలాంటిదే జరిగింది.

వేగంగా దూసుకొస్తున్న ఓ విమానం ఎత్తు నుంచి కిందికి పడిపోతూ రోడ్డుపైకి బొమ్మ విమానంలా దూసుకొచ్చింది. అది కూడా రద్దీగా ఉండే హైవే పైన. ఓ కారుకు రయ్యిమన ఎదురుగా దూసుకొచ్చి టైమ్ బావుండి కారు పక్క నుంచి వెళ్లిపోయింది. రోడ్డ పక్కన ఢమాల్ అని పడిపోయింది. టైమ్ మరింత బావుండి పైలట్ బతికి బట్టకట్టాడు. చిన్న గాయాలతో ఏదో బైక్ యాక్సిడెంట్ జరిగినట్లు బయటికి వచ్చేశాడు. దీనికి కారణం సిల్లీగా అనిపించినా ఖర్మ కాలితే అలానే ఉంటుందనిపిస్తుంది. విమానంలో ఇంధనం తక్కువగా ఉండడమే దీని కారణమని తేల్చారు. అ విమానాన్ని ఎయిర్ మెయిల్ ఉత్తరాల డెలివరీకి వాడుతున్నారు. కంపెనీ పేరు ఏరియల్ మెసేజెస్, సేఫ్‌గా బయపట్ట పైలెట్ పేరు రెమీ కాలిన్. ఓర్లాండోలోని యూనివర్సిటీ బొలేవర్, నార్త్ ఎకన్ లాక్టచీ ట్రైల్ దారితో ఈ ప్రమాదం జరిగింది.
small plane crashes into Orlando highway and skids onto a driveway
small plane crashes, Orlando highway, usa, traffic road, avian fuel