ఈ స్మార్ట్ కండోమ్ డాక్టర్‌లా సలహాలిస్తుంది..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ స్మార్ట్ కండోమ్ డాక్టర్‌లా సలహాలిస్తుంది..!

November 30, 2017

శృంగారం మానవ జీవితంలో ముఖ్యభాగం. ఈ విషయంలో అవగాహన ఉంటే సమస్యలు రావు. ఈ విషయంలో కొత్త విషయాలు తెలుసుకోవడానికి, మరింత మెరుగ్గా ఉండటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు.  ఇంతవరకు సుఖవ్యాధుల నిరోధం, సంతాన నిరోధానికే పనికొస్తుందని భావిస్తున్న కండోమ్‌లు ఇక మనకు డాక్టర్లలా  చక్కని సలహాలు, సూచనలు ఇవ్వనున్నాయి. మన లైంగిక జీవితానికి సంబంధించిన అంశాలపై సలహాలు ఇచ్చే స్మార్ట్ కండోమ్ వచ్చేసింది. దీన్ని బ్రిటన్ కంపెనీ ఐ.కాన్ తయారు చేసింది.


దీని వల్ల ఉపయోగాలు..

ఇది సెక్స్ సామర్థ్యాన్ని అంచనా వేస్తుంది.

సుఖవ్యాధులను గుర్తించి హెచ్చరిస్తుంది. సెక్స్ సమయాన్ని లెక్కిస్తుంది.

శృంగారంలో పాల్గొన్నప్పుడు ఎన్ని కేలరీలు ఖర్చవుతాయో తెలుపుతుంది.

శరీర ఉష్ణోగ్రత, వీర్యపరిమాణం వంటి మరెన్నో విలువైన, అవసరమైన వివరాలను అందిస్తుంది.

దీన్ని ఎన్నిసార్లయినా వాడొచ్చు.

ఎలా పనిచేస్తుంది?

ఐ.కాన్ సాధారణ కండోమ్‌లా ఉండదు. దీన్ని కండోమ్‌పైన ధరించాలి. ఇందులోని నానో చిప్స్‌, సెన్సర్ల ఉంటాయి. దీన్ని బ్లూతూత్ ద్వారా మీ స్మార్ట్‌ ఫోన్కు అనుసంధానం చేసుకోవాలి. కండోమ్ చార్జింగ్ చేసుకోవడానికి డివైస్ కూడా వస్తుంది. సిగ్గువల్ల డాక్టర్ల వద్దకు వెళ్లలేని వారికి ఇది బాగా సాయతుందని, తమ శృంగార జీవితాన్ని మరింత మెరుగుపరచుకోవడానికి పనికొస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ స్మార్ట్ కండోమ్ ధర రూ.5 వేలు ఉంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా మాత్రమే లభిస్తోంది.