సెల్ లో సొల్లేస్తూ..సోయి మరిస్తే... - MicTv.in - Telugu News
mictv telugu

సెల్ లో సొల్లేస్తూ..సోయి మరిస్తే…

June 10, 2017


స్మార్ట్ ఫోన్ ల వచ్చాక అస్సలు సోయి ఉండట్లేదు. ఫోన్ల ధ్యాసలో కొందరు రైళ్లకు ఎదురెళ్లితే… మరికొందరు వాహనాలకు అడ్డం పోతున్నారు. ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకుని పరధ్యానంగా రోడ్లపై నడుస్తున్నారు. ఈ లోకంతో పనేంటంటూ..గాల్లో తేలిపోతున్నారు. సెల్ లో సొల్లేస్తూ కొందరు వాహనాలు నడిపితే… మరికొందరు చిట్ చాట్ చేస్తూ పుట్ పాత్ లపై పిల్లినడకలు నడుస్తున్నారు. ఇలా సోయి మరిస్తే లైఫ్ చాప్టర్ క్లోజే…ఎందుకంటే…
ట్వంటీఫోర్స్…ఫోన్..ఫోన్.. 4జీ ఫోన్..పొద్దున్న లేసిన దగ్గర్నుంచి రాత్రిపడుకునే దాకా అందులోనే.పని ఉన్నా లేకపోయినా.. తెగ సొల్లు.. చాటింగ్ , వీడియో కాలింగ్ అంటూ కాలాన్ని హారతి కర్పూరంలా కరిగించేస్తున్నారు. వాహనాలు నడుపుతూ, రోడ్లపై వెళ్తూ కూడా ఫోన్ వదలడం లేదు. కొందరైతే చెవులకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మరి లోకాన్నే మరిచిపోతున్నారు. పరధ్యానంతో ప్రమాదాల్ని కొనితెచ్చుకుంటున్నారు. గల్లీ నుంచి వరల్డ్ దాకా ఇదే పరిస్థితి. స్మార్ట్ ఫోన్ మాయలో పడి స్మార్ట్ గా లైఫ్ కు ఎండ్ కార్డు వేసుకుంటున్నారు.

యూపీలో మొన్న ఫోన్ మాట్లాడుతూ ఓ అమ్మాయి గూడ్స్ బండికి ఎదురెళ్లింది. ట్రైన్ డ్రైవర్ గమనించి బ్రేక్ వేసినా అది ఆగలేదు. రైలు కింద పడిపోయిన ఆమె అదృష్టవశత్తూ చిన్న గాయాలతో బయటపడింది.

ఇక అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో ఓ మహిళా సెల్‌ఫోన్‌లో ఎస్ ఎం ఎస్ లు టైప్‌ చేస్తూ పరధ్యానంగా ఫుట్‌పాత్‌పై నడుస్తూ గుంతలో పడిపోయింది.
67 ఏళ్ల ఓ మహిళ సెల్‌ఫోన్‌లో ఏదో టైప్‌ చేస్తూ ఆ దారిలో తెరిచి ఉన్న ఓ బేస్‌మెంట్‌ డోర్లను గమనించలేకపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా అందులో పడిపోయింది. 6 అడుగుల లోతులో ఉన్న గొయ్యిలో పడ్డ ఆమెను చూసి బయటకు లాగారు. సీసీ కెమెరాల్లో నమోదైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

ఇలాంటి ఘటనలు ఎన్ని చోటుచేసుకున్నా.. అలాంటి వారిలో మార్పు రావడం లేదు. జర సోయితో సెల్లును ఆపరేట్ చేయుండ్రి..లేదంటే ప్రమాదపుటంచుల్లోకి వెళ్తారు. లైఫ్ కు ఎండ్ కార్డు పడొచ్చు..బీ కేర్ ఫుల్…