స్మార్ట్ ఫోన్లు నేలకేసి కొట్టిన పగలని టెక్నాలజీ..! - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ ఫోన్లు నేలకేసి కొట్టిన పగలని టెక్నాలజీ..!

June 5, 2017

ఎంత కాస్ట్లీ ఫోన్ అయినా చేతిలో నుంచి జారిదంటే పగిలిపోవాల్సిందే. మళ్లీ కొత్త గ్లాస్ , కవర్ వేసినా మునుపటిలా ఉండవు. వేల వేలు పోసి కొన్న ఫోన్ పగిలిదంటే ఆ బాధ మామూలుగా ఉండదు.. డోంట్ వర్రీ భవిష్యత్ ఇక ఆ బాధల్లేవ్ ..ఎందుకంటే..
స్మార్ట్‌ఫోన్లు పగులకుండా చూసే టెక్నాలజీని సైంటిస్తులు ఆవిష్కరించారు. మెరుగైన రసాయన స్థిరత్వం, కాంతి, ఫ్లెక్సిబిలిటీ సహాయంతో మిరకల్ మెటీరియల్‌ను కనుగొన్నారు. ఈ టెక్నాలజీతో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు పగిలే అవకాశం చాలా తక్కువగా ఉంటుందట. ప్రస్తుతం చాలా స్మార్ట్‌ఫోన్లు సిలికాన్ అనే పదార్థంతో తయారవుతున్నాయి. ఈ రకం ఫోన్లు ఖరీదైనవి కావడంతోపాటు కిందపడితే పగిలిపోతాయి. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడుపోవడంతో మరింతకాలం మన్నికయ్యే, తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే స్మార్ట్‌ఫోన్లను వినియోగదారులకు అందించాలని తయారీదారులు భావిస్తున్నారని యూకేలోని క్వీన్స్ యూనివర్సిటీ పరిశోధకులు చెప్పారు. గ్రాఫీన్ వంటి లేయర్ల మెటీరియల్‌తో సెమీకండక్టింగ్ అణువులను కలపడం ద్వారా విశిష్టమైన మెటీరియల్ టెక్నాలజీని కనుగొన్నామన్నారు.