ఇప్పడు స్మార్ట్ ఫోన్ల యుగం..రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి తెగ అట్రాక్ట్ చేస్తోంది. ప్రపంచంలోనే అతిచిన్న మొబైల్‌ను ఎలరీ అనే సంస్థ క్రెడిట్ కార్డు కంటే తక్కువ సైజులో ఉండే ఓ ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్ ఇది అని అంటోంది. ఎలరీ నానోఫోన్ సీ పేరుతో రూపొందించిన ఈ ఫోన్‌ను ఆన్లైన్ మొబైల్ ఆక్సెసరీస్ వెబ్సైట్ యెర్హా.కామ్ ద్వారా భారత్ మార్కెట్లో రిలీజ్ చేశారు. దీని ధర రూ. 3,940గా నిర్ణయించింది.జీఎస్ఎం మోడల్లో ప్రపంచంలోనే అతి చిన్న ఫోన్ ఇదట. నానోఫోన్ సీ బరువు కేవలం 30 గ్రాములు మాత్రమే. బ్లాక్, రోస్‌గోల్డ్, సిల్వర్ రంగులో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.
ఫోన్ ఫీచర్లు
* 1 అంగుళం డిస్ప్లే
* ఆర్టీఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్
* మీడియాటెక్ ఎంటీ6261డీ చిప్సెట్
* 32 ఎంబీ ర్యామ్
* 32 ఎంబీ ఇంటర్నల్ స్టోరేజ్
* మెమొరీ కార్డు ద్వారా 32జీబీ వరకు పెంచుకునే సామర్థ్యం
* 280ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం
* ఎంపీ3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, వాయిస్ రికార్డింగ్ ఫీచర్లు
* బ్లూటూత్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లతో కనెక్ట్ చేసుకునే సదుపాయం