కరోనా సోకిందో లేదో కనిపెట్టే స్మార్ట్ ఫోన్
కరోనా మహమ్మారి భయం ప్రపంచాన్ని వణికిస్తోంది. దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా కరోనా వైరస్ సోకిందేమో అని ప్రజలు అనుమానిస్తున్నారు. దీంతో ప్రజల్లో కరోనా భయం పోవాలంటే ఎక్కువగా టెస్టులు చేయాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త పరికరాలు, యాప్‌లను పుట్టుకొస్తున్నాయి.
తాజాగా కరోనా ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంట్లోనే ఉండి తెలుసుకోవడానికి అమెరికాలోని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఓ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించారు. 'కొత్త మొబైల్ సెన్సర్‌తోపాటు కృత్రిమ మేధను కలిపి ప్రాజెక్టులో ఉపయోగించాం. మనిషి శ్వాస ప్రక్రియలోని శబ్ద తరంగాలను కొలుస్తూ వాటిలో కలిగే మార్పులను నమోదు చేసేలా స్మార్ట్ ఫోన్‌లోని మైక్రోఫోన్లను, స్పీకర్లను ఏర్పాటు చేశాం. ఈ స్మార్ట్ ఫోన్ ఒకవేళ వైరస్ సోకితే శ్వాసలోని శబ్దాలను ఎప్పటికప్పుడు పసిగడతాయి. ఈ మొత్తం వ్యవస్థ ఓ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. దానిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది' అని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ వెయి గావో తెలిపారు.