స్మార్ట్‌ఫోన్ తో నడిచే ఫ్యాన్ కావాలా గురూ..! - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్‌ఫోన్ తో నడిచే ఫ్యాన్ కావాలా గురూ..!

March 12, 2018

ఎండాకాలం వచ్చేసింది. మనం ఇంట్లో ఉన్నప్పుడు సల్లగా ఉండేందుకు ఏసీనో లేదా ఫ్యాన్‌నో, కూలరో వేస్కుంటాం. అయితే బయటకు ఎటైనా వెళ్లినప్పుడు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతుంటాం. చేతిలో బుక్కో అట్టముక్కనో పట్టుకుని గాలి ఊపుకుంటాం. అందుకే  మనకెందుకీ కష్టాలు అని ఆలోచించారేమో అందుకే మొబైల్‌తో నడిచే మినీ ఫ్యాన్‌ను తయారు చేశారు.

రెండు రెక్కలతో ఉండే ఈ ఫ్యాన్ మీరు ఛార్జింగ్ పెట్టే పోర్టుకు పెడితే చాలు మీ మొఖానికి చల్లటి గాలి తగులుతుంది. మరి ఈ ఫ్యాన్ ధర ఎంత ఉంటుదో అని భయపడెరు కేవలం రూ.66 నుంచే మొదలవుతుంది. క్వాలిటీని బట్టి 300 వరకు ధరను నిర్ణయించారు.  మినీ ఇన్ ది బాక్స్ వెబ్‌సైట్‌లో, అమెజాన్‌లో ఇవి అందుబాటులో ఉన్నాయి. మీరు ఆన్‌లైన్లో ఆర్డర్ చేస్తే చాలు ఉచిత హోం డెలివరీ, క్యాష్ ఆన్ డెలివరీ సౌకర్యాలు ఉన్నాయి.