రూ.7 వేలకే నోకియా 6.1 మొబైల్‌ - MicTv.in - Telugu News
mictv telugu

రూ.7 వేలకే నోకియా 6.1 మొబైల్‌

July 7, 2019

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా 6.1 ఆండ్రాయిడ్‌ మొబైల్‌ ధరను మరో రూ.2000 తగ్గించింది. మొదట్లో రూ.8,999, రూ.10,999 గా ఉన్న ఫోన్ల ధరలను రెండు వేలు తగ్గించింది. దీంతో 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్ ఫోన్ రూ.6,999లు, 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,999లకే లభించనుంది. తగ్గించిన ధరలతో అమెజాన్‌, ప్లిఫ్‌కార్ట్‌లలో ఇది అందుబాటులో ఉంటుందని నోకియా పేర్కొంది. అయితే ఆఫ్‌లైన్‌ మార్కెట్‌లో వీటి ధరలను తగ్గించలేదని తెలిపింది.

Nokia 6.1 Price in India Cut

నోకియా 6.1 ఫీచర్లు

* 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

* 3జీబీ ర్యామ్‌+32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్ మెమొరీ

* స్నాప్‌డ్రాగన్‌ 630 ప్రాసెసర్‌

* 16 మెగాపిక్సెల్‌ రేర్ కెమెరా, 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా

* 3000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ