స్మార్ట్ శానిటైజర్ వచ్చేసింది.. స్మార్ట్ ఫోన్ల కోసం - MicTv.in - Telugu News
mictv telugu

స్మార్ట్ శానిటైజర్ వచ్చేసింది.. స్మార్ట్ ఫోన్ల కోసం

August 1, 2020

smartphone UV Sterilizer goes global

కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మాస్కులు ధరించడం, శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అయింది. వైరస్ సోకకుండా ఉండడానికి మనుషులు వినియోగించే ప్రతి వస్తువును శానిటైజ్ చేస్తున్నారు. మొబైల్, హెడ్ ఫోన్స్ ఇలా స్మార్ట్ డివైజ్ లను కూడా శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో సౌత్ కొరియాకు చెందిన దిగ్గజ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ స్మార్ట్ శానిటైజర్ ను ప్రవేశ పెట్టింది. 

దీంతో స్మార్ట్‌ఫోన్లతో సహా ఇతర యాక్ససరీస్ ను శానిటైజ్ చేసుకోవచ్చు. యూవీ స్టెరిలైజర్ పేరుతో ఈ డివైస్ ను లాంచ్ చేసింది. దీంతో స్మార్ట్‌ఫోన్లు, ఇయర్‌బడ్స్‌, సన్ గ్లాసెస్, కీస్ ల‌ను కేవలం పది నిమిషాల్లోనే శానిటైజ్ చేయవచ్చు. ఈ డివైస్‌కు ఓ బిల్టిన్ వైర్‌లెస్ చార్జర్‌ను అందిస్తున్నారు. ఇది ఒక బాక్స్ మాదిరి ఉంటుంది. దీని లోపల డివైస్‌లను ఉంచి మూత పెట్టి పైన ఉండే బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు. 10 నిమిషాల్లో లోపల ఉన్న డివైస్‌లు ఆటోమేటిక్ గా శానిటైజ్ అవుతాయి. దీని ధరను  రూ.3,599 గా నిర్ణయించారు.