స్మితా సబర్వాల్‌కు రూ. 15 లక్షల జరిమానా - MicTv.in - Telugu News
mictv telugu

స్మితా సబర్వాల్‌కు రూ. 15 లక్షల జరిమానా

May 3, 2022

ఐఏఎస్ అధికారిణిగా స్మితా సబర్వాల్‌కు తెలంగాణ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. రూ. 15 లక్షలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. 2015 జూన్‌లో హైదరాబాదులోని ఓ ఫ్యాషన్ షోలో తన భర్తతో కలిసి స్మితా సబర్వాల్ ర్యాంప్ వాక్ చేశారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, 2015 జులైలో ‘నో బోరింగ్ బాబు’ అనే శీర్షికతో అవుట్ లుక్ అనే పత్రిక ఓ వ్యాసాన్ని, క్యారికేచర్‌ను ప్రచురించింది. ఈ కథనం తన పరువుకు నష్టం కలిగించేలా ఉందంటూ స్మితా సబర్వాల్‌ రూ. 10 కోట్లకు పరువు నష్టం దావా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. దాంతో ప్రభుత్వం రూ. 15 లక్షలు విడుదల చేసింది.

కానీ, ప్రైవేటు వ్యాజ్యం కోసం ప్రభుత్వ నిధులను వాడుకోవడంపై మూడు వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు కావడంతో తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.”అధికారుల విధుల్లో భాగంగా వివాదాలు తలెత్తినప్పుడు మాత్రమే ప్రభుత్వం సహాయం చేయాలి. స్మితా సభర్వాల్ రూ. 15 లక్షలను ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలి. 90 రోజుల్లో ఈ మొత్తాన్ని చెల్లించాలి. లేని పక్షంలో గడువు తీరిన 30 రోజుల్లో ప్రభుత్వమే ఆమె నుంచి రికవరీ చేయాలి” అని ఆదేశాలు జారీ చేసింది.

మరోపక్క గతంలో స్మితా సబర్వాల్‌ మెదక్ జిల్లా కలెక్టర్‌గా ప్రజలకు పలు సేవలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె పనితీరును గుర్తించిన కేసీఆర్ ప్రభుత్వం.. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమించింది. అప్పటినుంచి ఆమె కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్నారు.