Smita sabharwal tweet on MP HC Verdict on Gang-Rape Convict
mictv telugu

ఇలాగే కొనసాగితే.. మహిళల చేతికి త్వరలోనే ఆయుధాలు.. స్మితా సబర్వాల్

November 8, 2022

ముందస్తు విచారణకు అవకాశం లేని కారణంగా గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ ఓ నిందితుడికి విధించిన 25 ఏండ్ల శిక్షను శిక్షను మధ్యప్రదేశ్ హైకోర్టు 5 ఏండ్లకు తగ్గించింది. ఈ మేరకు జస్టిస్ రోహిత్ ఆర్య మరియు జస్టిస్ రాజీవ్ కుమార్ శ్రీవాస్తవ ధర్మాసనం తీర్పునిచ్చింది. సెక్షన్ 389 (1) ప్రకారం ఆ నిందితుడిని రూ.2,00,000/- వ్యక్తిగత పూచికత్తుపై.. బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ఇంతకుముందు కూడా మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఇండోర్‌ బెంచ్‌.. లైంగిక దాడి కేసులో దోషి శిక్షను జీవిత ఖైదు నుంచి 20 ఏండ్లకు తగ్గించింది. రేప్‌ క్రూరమైనదైనా, లైంగిక దాడి తర్వాత దోషి ఆ 4 ఏండ్ల బాధితురాలిని ప్రాణాలతో వదిలివేశాడని, సజీవంగా వదిలిపెట్టేంత దయ చూపాడని కోర్టు పేర్కొన్నది. ఈ తీర్పులపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ తీర్పులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో నెటిజన్లతోపాటు , పలువురు సెలబ్రిటీలు పలు పోస్ట్‌లు, కామెంట్‌లు పెడుతున్నారు.

సామాజిక సమస్యలపై ఎక్కువగా స్పందించే ఐఏఎస్ ఆఫీసర్, సీఎంఓ సెక్రటరీ స్మితా సబర్వాల్.. కూడా ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ట్విటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. న్యాయవ్యవస్థలో ఇలాంటి తీర్పులు ఇంకా ఇలానే కొనసాగితే, ఈ దేశంలోని మహిళలకు ఆయుధాలు ధరించే హక్కును అనుమతించే సమయం అతి త్వరలోనే వస్తుందంటూ ట్వీట్ చేశారు.’న్యాయం మరియు చట్టం రెండు వేర్వేరు విషయాలు కావు’ అని అంటూ.. సిగ్గుచేటు అంటూ యాష్ ట్యాగ్‌ను తగిలించారు.

ఇదొక్కటే కాదా.. తాజాగా ఢిల్లీ హైకోర్టు కూడా ఇలాంటి తీర్పే ఇచ్చింది. పదేళ్ల క్రితం గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డ ముగ్గురు నిందితులను నిర్ధోషులుగా ప్రకటించింది సుప్రీం. ఢిల్లీ హైకోర్టు వేసిన దోషుల ఉరిశిక్షను రద్దు చేయడమే గాక.. వారిని నిర్దోషులుగా ప్రకటిస్తూ సంచలన తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పుపై బాధితురాలి కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం కొనసాగిస్తామని తెలిపింది.