Smoke on Air India flight in muskat
mictv telugu

వీడియో : ఎయిరిండియా విమానంలో పొగలు.. తప్పిన పెను ప్రమాదం

September 14, 2022

రన్‌వేపై ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం నుంచి పొగలు రావడం కలకలం రేపింది. ఒమన్ రాజధాని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి కొచ్చి రావాల్సిన బోయింగ్ 737- 800 విమానం ఇంజిన్‌ నుంచి పొగలు రావడంతో ప్రయాణీకులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి 141 మంది ప్రయాణీకులను కిందకు దింపేశారు. అనంతరం భయంతో పరుగులు పెట్టిన ప్రయాణీకుల దృష్యాలు వీడియోలో రికార్డయ్యాయి. ఇందులో 14 మందికి స్వల్ప గాయాలయ్యాయి. విమానం నుంచి దింపేసిన తర్వాత ప్రయాణీకులందరినీ సురక్షితంగా టెర్మినల్ భవనంలోకి తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణీకుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు డీజీసీఏ అధికారులు వెల్లడించారు. కాసేపట్లో టేకాఫ్ అవడానికి సిద్ధంగా ఉన్న విమానంలో అకస్మాత్తుగా పొగలు రావడంపై దర్యాప్తు చేస్తున్నామని, సాంకేతిక లోపాలపై దృష్టి పెట్టామని అధికారులు తెలిపారు.