దుర్గమ్మ ఆవరణలో పొగతాగితే రూ.200 ఫైన్ - MicTv.in - Telugu News
mictv telugu

దుర్గమ్మ ఆవరణలో పొగతాగితే రూ.200 ఫైన్

June 25, 2022

పొగరాయుళ్లకు బెజవాడ దుర్గమ్మ ఆలయ అధికారులు పొగపెట్టారు. ఆలయ పరిసరాల్లో పొగ తాగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కట్టు తప్పితే రూ. 20 నుంచి రూ. 200 వరకు జరిమానా విధిస్తామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. తిరుమల వెంకన్న ఆలయంలో ఇప్పటికే పొగాకు వినియోగంపై నిషేధం ఉంది.
భక్తుల ఆరోగ్యం, సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకుని దుర్గగుడి పరిసరాలను కూడా పొగాకు రహిత ప్రాంతంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. మెట్ల మార్గం నుంచి కొండ పైవరకు నిషేధాజ్ఞ‌లు అమల్లోకి వస్తాయి. పొగాకు వాడకాన్ని తగ్గించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడం లేదు. తాగే వాళ్లు తమ ఆరోగ్యాలను పాడు చేసుకోవడమే కాకుండా పక్కనున్న వాళ్ల ఆరోగ్యాలు కూడా చెడగొడుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్ పై నిషేధం ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్లపక్క చాటుమాటుగా మూత్రం పోస్తే జరిమానా వేస్తున్న అధికారులు అందరి పక్కనా నిలబడి దర్జాగా దమ్ముకొడుతున్న వాళ్ల జోలికి మాత్రం పోవడంలేదు.