కార్యకర్త‌కు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన స్మృతి ఇరానీ - MicTv.in - Telugu News
mictv telugu

కార్యకర్త‌కు కన్నీటి వీడ్కోలు.. పాడె మోసిన స్మృతి ఇరానీ

May 26, 2019

Smriti Irani Attends Funeral Of BJP Worker Shot Dead In Amethi.

యూపీలోని అమేథిలో బీజేపీ కార్యకర్త, స్మృతి ఇరానీ సహచరుడైన సురేంద్ర సింగ్‌‌ని శనివారం కొందరు దుండగులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఆదివారం సాయంత్రం నిర్వహించిన అంత్యక్రియలకు స్మృతి ఇరానీ హాజరై కన్నీరుమున్నీరుగా విలపించారు. సురేంద్ర సింగ్ భౌతిక కాయాన్ని స్వయంగా తన భుజాలపై మోశారు.

బరూలియా గ్రామానికి చెందిన సురేంద్ర సింగ్ బీజేపీకి మద్దతుదారుడిగా ఉన్నాడు. అంతేకాక స్మృతి ఇరానీకి సన్నిహితుడు. ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె వెంటే ఉండి గెలుపునకు కృషి చేశాడు. శనివారం రాత్రి  సురేంద్రసింగ్‌ను దుండగులు తుపాకీతో కాల్చి చంపారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు రోజులకే ఇలా జరగడంతో సురేంద్ర సింగ్ ఊర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమేథీలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ స్మృతి ఇరానీ గెలుపొందిన తర్వాత ఈ హత్య జరగడం కలకలం రేపుతోంది.