కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా  - MicTv.in - Telugu News
mictv telugu

కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా 

October 28, 2020

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కరోనా బారినపడ్డారు. అనారోగ్య లక్షణాలతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ నిర్దారణ అయింది. స్వయంగా ఆమె తన ట్విట్టర్ ఖాతా ద్వారా ధ్రువీకరించారు. తనను ఇటీవల కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు ఉంటే తక్షణమే పరీక్షలు చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

ఇటీవల ఆమె బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఈ క్రమంలోనే ఆమె వైరస్ బారినపడ్డారు. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంలో పలువురు మంత్రులకు వైరస్ సోకింది. హోంమంత్రి అమిత్ షా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్‌ సహా పలువురికి వ్యాధి కోలుకున్నారు. మరికొంత మంది ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. ఇటీవలే కేంద్ర మంత్రి సురేష్ అంగడి వ్యాధి కారణంగా మరణించిన సంగతి కూడా తెలిసిందే.