Smriti Irani's daughter caught in controversy of serving Beef in Goa's Restaurant & Bar.
mictv telugu

స్మృతి ఇరానీ కూతురిదిగా భావిస్తున్న రెస్టారెంటులో బీఫ్

July 26, 2022

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయిష్ ఇరానీ నిబంధనలకు విరుద్ధంగా గోవాలో బార్ నడుపుతున్నారంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తమవద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయని, చనిపోయిన వ్యక్తి పేరిట స్మృతి కూతురు లైసెన్స్ తీసుకున్నదని చెబుతున్నారు ఆ పార్టీ నాయకులు. స్మృతి ఇరానీ ప్రమేయం లేకుండానే ఆమె కూతురు లైసెన్స్‌ పొందడం సాధ్యమేనా? అంటూ ప్రశ్నించారు. అయితే, ఇవన్నీ నిరాధార ఆరోపణలేనని, ఈ క్రమంలోనే క్షమాపణలు డిమాండ్‌ చేస్తూ.. మంత్రి స్మృతి ఇరానీ కాంగ్రెస్‌ కీలక నేతలకు లీగల్‌ నోటీసులు కూడా పంపారు.

ఇదిలా ఉంటే.. గతంలో కూతురు నడిపించే సదరు కేఫ్‌ అండ్‌ బార్‌కు, ఆమె డిషెస్‌కు దక్కిన రివ్యూలపై స్వయంగా స్మృతి ఇరానీనే స్పందించడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన మీడియా కథనాలు, ఆమె ఇచ్చిన రివ్యూ తాలుకా స్క్రీన్‌షాట్లు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఆమె నడిపిస్తున్న రెస్టారెంట్‌ మెనూను సైతం కొందరు తెర మీదకు తెస్తున్నారు. #smritiiranidaughter హ్యాష్‌ ట్యాగ్‌తో పేరుతో ఆ మెనూలో బీఫ్‌ ఉండడాన్ని ప్రస్తావిస్తున్నారు. ప్రస్తుతం ఇది రాజకీయపరమైన విమర్శలకు దారి తీస్తోంది.