Smriti Mandhana Became The Captain Of RCB
mictv telugu

WPL 2023 :ఆర్సీబీ కెప్టెన్‌గా స్మృతి మంధాన

February 18, 2023

 

Smriti Mandhana Became The Captain Of RCB

మహిళల ప్రీమియర్ లీగ్(WPL)వేలంలో అత్యధిక ధర(3.4 కోట్లు)కు అమ్ముడుబోయిన భారత్ ఓపెనర్ స్మృతి మంధాన మరో జాక్ పాట్ కొట్టేసింది. ఆర్సీబీ పగ్గాలను స్మృతి మంధానకు జట్టు యాజమాన్యం అప్పగించింది. ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ, ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ప్రకటించారు. ఈ వీడియాను ఆర్సీబీ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది .దీంతో ఆర్సీబీ మొదటి కెప్టెన్‌గా మంధాన రికార్డు సృష్టించింది. జట్టు బాధ్యతలు అప్పగించడంపై మంధాన సంతోషం వ్యక్తం చేశారు. జట్టు విజయాలకోసం 100 శాతం ప్రయత్నిస్తానని తెలిపారు.

 

మహిళల ప్రీమియర్ లీగ్ మార్చి 4 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 5 జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. మ్యాచ్‌లు అన్నీ ముంబైలోనే నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. డబ్ల్యూపీఎల్ తొలి సీజన్‎లో మొత్తం 20 లీగ్ మ్యాచులు.. 2 ప్లే ఆఫ్ మ్యాచులు.. 23 రోజుల పాటు జరుగుతాయి. చివరి మ్యాచ్ మార్చి 26న జరగనుంది. వేలం పాటలో మొత్తం 87 మంది క్రికెటర్లను ఆయా ఫ్రాంచైజీలు దక్కించుకున్నాయి.