ఏపీలో 'పుష్ప' రేంజ్‌లో స్మగ్లింగ్.. భరతం పట్టిన పోలీసులు - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో ‘పుష్ప’ రేంజ్‌లో స్మగ్లింగ్.. భరతం పట్టిన పోలీసులు

May 16, 2022

ఇటీవలే తెలుగులో విడుదలైన ‘పుష్ప’ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. గంజాయి సరుకుతో ఉన్న వాహనాన్ని హీరో పోలీసులకు దొరకకుండా ఓ బావిలో లారీని పడేస్తాడు. ఆ తర్వాత డబ్బులు చేతికొచ్చాక, క్రేన్ సహాయంతో లారీని పైకి లాగుతారు. అదే సీన్.. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం భూపతిపాలెం వద్ద జరిగింది. పోలీసులు వెంటాడి, వేటాడి స్మగ్లర్ల భరతం పట్టారు ఆంధ్రా- ఒడిశా సరిహద్దు నుంచి మైదాన ప్రాంతం రహదారిపైకి వస్తున్న గంజాయి తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు గుర్తించారు. ఆ వాహనాన్ని ఆపాల్సిందిగా పోలీసులు కోరారు. పోలీసులకు సరుకు ఉందన్న విషయం తెలిసిపోవడంతో స్మగ్లర్లు వాహనాన్ని వేగంగా నడిపారు. దాంతో పోలీసులు స్మగ్లర్ల వాహనాన్ని వెంబడించారు.

చివరికి భూపతిపాలెం వద్ద డివైడర్‌ను ఢీకొట్టిన స్మగ్లర్ల కారు పక్కనే ఉన్న జలాశయంలోకి దూసుకెళ్లింది. వెంటనే కారులోంచి ఓ వ్యక్తి దూకి పారిపోయాడు. మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం క్రేన్‌ సాయంతో జలాశయంలో పడ్డ వాహనాన్ని బయటకు తీశారు. ఈ వాహనంలో ఉన్న 300 కేజీల గంజాయిని సీజ్‌ చేశారు.