స్కూటీపై వెళ్తుండగా నాగుపాము ప్రత్యక్షం
పాము అంత దూరంలో బుసకొడితేనే భయంతో పరుగులు తీస్తాం. అలాంటిది ఏకంగా చేతి వరకు వచ్చి తాకుతుంటే ఎలా ఉంటుంది. ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ. కానీ నిజాంగానే అలాంటి అనుభవం హైదరాబాద్ యువకుడికి ఎదురైంది. తాను స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా నాగుపాము ప్రత్యక్షమైంది. వెంటనే అతడు బైక్ పక్కకు పడేసి పరుగు అందుకున్నాడు. కీసర సమీపంలోని రాంపల్లి వద్ద ఈ ఘటన జరిగింది.
యాదాద్రి జిల్లా చీకటి మామిడికి చెందిన రాములు ఎఫ్‌సీఐలో ఉద్యోగం చేస్తున్నాడు. స్కూటీపై ఈరోజు తన స్కూటీపై బయలుదేరాడు. బైక్ బయట ఉండటంతో అంతకు ముందే దాంట్లో పాము దూరింది. ఇది గమనించని అతను డ్యూటీకి బయలుదేరాడు. రాంపల్లి మహంకాళి ఆలయం వద్దకు రాగానే ఆయన చేతిని ఏదో తాకుతున్నట్టుగా అనిపించింది. కిందకు దిగి చూడగా నాగుపాము బుసలు కొడుతూ కనిపించింది. వెంటనే స్కూటీని అక్కడే దూరంగా వెళ్లాడు. స్థానికులు ఇది చూసి పాములపట్టే వ్యక్తి సాయంతో బయటకు తీశారు.