చావుబతుకుల్లో పాములాయన.. విషపురుగులే అంత.. - MicTv.in - Telugu News
mictv telugu

చావుబతుకుల్లో పాములాయన.. విషపురుగులే అంత..

March 22, 2018

పాముకు పాలుపోసి పెంచినా కాటేస్తుంది. విషపురుగుల తీరే అంత. ఉత్తరప్రదేశ్‌లో మావూ ప్రాంతంలో ఒక పాములుపట్టే మనిషిని కొండచిలువ చంపినంత పనిచేసింది.

అతడు కొండచిలువను ఆడిస్తూ ఆడిస్తూ మెడకు చుట్టుకున్నాడు. అయితే అది అలానే గట్టిగా మెడకు చుట్టుకుపోయింది. అతడు ఊపిరాడక అపస్మారకంలోకి వెళ్లాడు. పాములాట చూస్తున్న వారు వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని, అత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెప్పారు.