పామును చంపితిన్న తాగుబోతు అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

పామును చంపితిన్న తాగుబోతు అరెస్ట్ 

May 7, 2020

Snake Eating Man Arrested 

లాక్‌డౌన్ తర్వాత తాగిన మైకంలో మందుబాబులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. 40 రోజుల తర్వాత లిక్కర్ నోట్లో పడటంతో రెచ్చిపోయి పిచ్చిగా ప్రవర్తించారు. అలాగే తాగిన మైకంలో పామును కొరికి చంపి దాన్ని మెడలో వేసుకొని తిరిగిన మందుబాబుకు అధికారులు తమదైన స్టైల్‌లో ట్రీట్ మెంట్ మొదలుపెట్టారు. అతన్ని అరెస్టు చేసి వన్య ప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఈ తతంగం వైరల్ కావడంతో అతన్ని అటవీ అధికారుల దృష్టికి వెళ్లడంతో చర్యలు చేపట్టారు. 

కర్నాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని ముష్టూరు గ్రామానికి చెందిన ఓ తాగుబోతు తాగిన మైకంలో హీరో ఇజం చూపించాడు. బైక్‌పై వెళ్తున్నసమయంలో అతనికి నాగుపాము కనిపించడంతో వెంటనే దాన్ని చేతిలోకి తీసుకొని నోటితో బలంగా కొరికి చంపాడు. అంతటితో ఆగకుండా దాన్ని మెడలో వేసుకొని మందుబాటిల్ నోట్లో పెట్టుకొని బైక్ పై తిరిగాడు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మైకంలో ఉన్మాదిలా ప్రవర్తించినందుకు అతనిపై కేసు నమోదు చేసినట్టు అధికారులు వెల్లడించారు.