బస్సులో బుసకొట్టిన పాము - MicTv.in - Telugu News
mictv telugu

బస్సులో బుసకొట్టిన పాము

October 30, 2019

ఆర్టీసీ బస్సులో ఓ భారీ సర్పం కలకలం సృష్టించింది. ఎప్పుడు దూరిందో ఏమో ఒక్కసారిగా బస్సు ఇంజిన్ నుంచి లోపలికి వచ్చి ప్రత్యక్షమై బుసలు కొట్టింది. కొంచెం పైకి రాగానే దాన్ని గమనించిన డ్రైవర్ విషయాన్ని ప్రయాణికులకు చెప్పాడు. వెంటనే పామును చూసిన వారంతా భయంతో వణికిపోయారు. అది ఏం చేస్తుందో అని అంతా కేకలు వేశారు. అయితే డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎవరికీ హాని జరగలేదు. కడప జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.   

Snake Entry in RTC Bus.

ప్రొద్దుటూరు నుంచి కడపకు ఉదయం బయలుదేరిన పల్లె వెలుగు బస్సు కొంత దూరం వెళ్లగానే ఓ పాము డ్రైవర్‌కు కనిపించింది. అంతకు ముందే ఇంజిన్‌లో దూరిన ఆ పాము వేడికి తట్టుకోలేక కొంచెం బయటకు వచ్చింది. అది ప్రయాణికుల వద్దకు వెళితే ప్రమాదం అని భావించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించారు. వెంటనే బస్సును ఆపి ప్రయాణికులను కిందకు దించాడు. బస్సు ఆగిన సమీపంలో పాములు పట్టే వ్యక్తి ఉండటంతో అతన్ని తీసుకువచ్చి మెల్లగా దాన్ని పట్టుకొని సమీపంలోని చెట్ల పొదల్లో వదిలిపెట్టాడు. తర్వాత ప్రయాణికులంతా తిరిగి తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.