మనం ఏడనన్న పాముగాదు గదా దాని తోకలెక్క జరంత ఆనవాళ్లు కనవడ్డా గజ్జున వణుకుతం,దానికి ఆమడ దూరం పోతం,కనీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంల పాములను జాతరగా ఊరేగిస్తూ,పాములను పూజిస్తూ పండుగ జర్పుకుంటరు,ప్రతీ సంవత్సరం జూలై,ఆగస్టు మద్యలో అందరూ శెట్లు పుట్టలు దిర్గి పాములు వడ్తరట,ఆ పట్టిన పాములను చేతుల పట్టుకొని పాటలు పాడుకుంట..డప్పులు కొట్కుంట భక్తితో పూజిస్తూ…గల్లీలన్ని తిర్గుతూ ఓ జాతరలెక్క ఊరేగిస్తరట.ఆ తర్వాత వాటిని ఏడికేలి పట్కచ్చిన్రో ఆడ ఇడ్శిపెడ్తరట.
ఇలా పాములతో జాతర చెయ్యడానికి కారణం..?
వర్షాలు బాగా పడాలని..అందరిని సల్లగ సూడుమని పాము దేవతకు కొలుస్తూ ఈ పండుగ జర్పుకుంటరట,ఇంకొందరేమో ఇది 400 ఏండ్ల నుంచి వస్తున్న ఆచారం..అప్పట్లో ఉండే రాజు … పాములు పట్టి ఆడించేవారిని ప్రోత్రహించేందుకు జాతరలాగా దీన్ని ప్రారంబించాడని చెపుతున్రు. ఎవరి ఆచారం వాళ్లది..తమిళనాడులో జల్లికట్టు ఉన్నట్టు..కర్నూలు జిల్లా దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో కర్రలతో కొట్టుకున్నట్టు..వీళ్లది కూడా ఓ ఆచారమన్నట్టు.