హెల్మెట్‌లో దూరిన పాము..ఓ టీచర్‌కు ఊహించని షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

హెల్మెట్‌లో దూరిన పాము..ఓ టీచర్‌కు ఊహించని షాక్

February 14, 2020

bdfrh vbcrd

షూలు,ఏసీల్లో పాములు దూరడం చూసి ఉంటాం. కానీ ఓ పాము ఏకంగా హెల్మెట్‌లో దూరింది. అది చూడని ఆ వ్యక్తి దాన్ని పెట్టుకొని పాముతో పాటు అలాగే 7 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. కేరళలో ఓ ఉపాధ్యాయుడికి ఈ వింత అనుభవం ఎదురైంది. అయితే అప్పటికే ఆ పాము చనిపోయి ఉండటంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

కందానాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌లో పనిచేస్తున్న టీచర్ రంజీత్ ఇటీవల స్కూలుకు బయలుదేరాడు. ఎప్పటిలాగే బైక్ వద్ద ఉన్న హెల్మెట్ పెట్టుకొని కొంత దూరం వెళ్లాడు. 

హెల్మెట్ తీస్తుండగా లోపల ఏదో కదులుతున్నట్లు కనిపించడంతో దాన్ని పరిశీలనగా చూసి షాకయ్యాడు. అందులో ఓ పాము చనిపోయి కనిపించింది. తాను హెల్మెట్ పెట్టుకోవడం వల్లే చనిపోయిందా లేక ఎవరైనా కావాలనే పెట్టారా అనేది తెలియలేదు. ఇక నుంచి హెల్మెట్‌ను చెక్ చేసుకోకుండా తలకు పెట్టుకోకూడదని పలువురు హెచ్చరిస్తున్నారు.