నీలీ నీలీ ఆకాశం కంటే అందమైన పాము (వీడియో)  - MicTv.in - Telugu News
mictv telugu

నీలీ నీలీ ఆకాశం కంటే అందమైన పాము (వీడియో) 

September 18, 2020

Snake more beautiful than the blue sky

మనం ఇంతవరకు ఆకుపచ్చ, గోధుమ, నలుపు, తెలుపు రంగుల్లో పసిరిక పాములను చూశాం. అవి గాల్లోకి ఎగురుతుంటాయి. ఈ చెట్టు పైనుంచి ఆ చెట్టు పైకి చక్కగా దూకుతుంటాయి. అయితే ఇప్పుడు మనం ఇంకో కొత్త రంగు పసిరిక పామును చూడబోతున్నాం. నీలినీలి ఆకాశం, పాలపిట్ట రంగులను పులుముకున్నట్టు ఉంటుంది ఈ పాము. గులాబీ పువ్వును కరుచుకుని కూర్చున్న ఈ పాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రంగు పామును ఇంతవరకు చూసినవారు అరుదు అనే చెప్పాలి. 

వాటి సంఖ్య కూడా చాలా తక్కువ అంటున్నారు నిపుణులు. లేత నీలి రంగులో ఉండే ఈ పాము పేరు బ్లూ పిట్‌ వైర్‌. పిట్‌ వైపర్‌ జాతి పాములు సాధారణంగా తెలుపు, ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా నీలం రంగులో చాలా అరుదుగా ఉంటాయి. ఇవి ఇండోనేషియా, తూర్పు తైమూర్లలో కనిపించే విషపూరిత పిట్ వైపర్ ఉప జాతులు. ‘లైఫ్‌ ఆన్‌ ఎర్త్‌’ అనే ట్విటర్‌ అకౌంట్ నుంచి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు రెండు మిలియన్ల వ్యూవ్స్‌ వచ్చాయి. అందంగా కనిపిస్తున్న ఈ పామును చూసి నెటిజన్లు ఔరా అంటున్నారు. గ్రాఫిక్ పాములా ఉందని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇది పైకి కనిపించేంత సాఫ్ట్‌ పాము కాదట. ఇది అత్యంత విషపూరితమైనది అంటున్నారు. ఈ పాము కరిస్తే తీవ్రమైన నొప్పి, రక్తస్రావం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.