హైదరాబాద్‌కు మరో ప్రత్యేకత..పాముల పార్కు ప్రారంభం - MicTv.in - Telugu News
mictv telugu

హైదరాబాద్‌కు మరో ప్రత్యేకత..పాముల పార్కు ప్రారంభం

June 5, 2020

snake

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరింది. తాజాగా హైదరాబాద్ లో పాముల పార్కును ఏర్పాటు చేశారు. నగరం పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40కోట్ల వ్యయంతో పాముల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును ఈ రోజు ప్రారంభించారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా సర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న పాముల సంరక్షణ, అలాగే వివిధ రకాల పాముల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ పార్క్ ఉయోగపడనుంది.