Snake running with sandal in the mouth funny video goes viral in social media
mictv telugu

చెప్పును దొంగలించిన పాము..వీడియో వైరల్

November 25, 2022

సోషల్ మీడియా పుణ్యమని ఎన్నో అద్భుతాలు, ఇంట్రెస్టింగ్ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా చిటికెలో వైరల్‌గా మారుతుంది. నమ్మశక్యంగాని విషయాలు సైతంకంటపడుతున్నాయి. తాజాగా ఓ పాము చెప్పును తీసుకుపోతున్న వీడియో హాస్యాస్పదంగా ఉంది. ఓ ఇంటి వైపు వచ్చిన సర్పం అక్కడ కనిపించిన చెప్పును నోటకర్చుకుంది.

ఏమనుకుందో తెలియదు కాని..అక్కడి నుంచి చెప్పును పట్టుకొని పరుగులు తీసింది. అక్కడ ఉన్నవారు అరచిన ఏ మాత్రం చెప్పును వదిలిపెట్టకుండా తీసుకెళ్ళిపోయింది. ఈ వీడియోను పర్వీన్ కాశ్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి షేర్ చేశాడు. ‘ఈ పాము ఆ చప్పల్‌ తీసుకుపోయి ఏం చేస్తుందో..? నాకు ఆశ్చర్యంగా ఉంది. దానికి కాళ్లు కూడా లేవు’ అని కామెంట్‌ను జతచేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. పాము కోరలు చెప్పులో దిగి ఉండిపోవడంతో అలా జరిగిందని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైన ఈ వీడియో చూసిన వారికి చెప్పును పాము తీసుకెళ్లడం కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందన్న విషయం మాత్రం తెలియలేదు.