పాముల శ్రీనివాస్...పాము కాటుతో మృతి! - MicTv.in - Telugu News
mictv telugu

పాముల శ్రీనివాస్…పాము కాటుతో మృతి!

July 28, 2017

సింగరేణి ప్రాంతంలో ఎక్కడ పాము కనిపించినా.క్షణాల్లో ప్రత్యక్షమై పాములను పట్టేవాడు శ్రీనివాస్.ఎంత విషపూరితమైన పామునైనా చాక చక్యంతో పట్టి  తీసుకెళ్లి అడవిలో వదిలేసేవాడు,సింగరేణి కార్మికుడైనా..పాముల శ్రీనివాస్ గానే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీనివాస్.శ్రీనివాస్ మందమర్రి ఏరియాలో సింగరేణి సివిల్ విభాగంలో పనిచేస్తున్నారు.ఆయన హఠాత్తుగా మరణించడంతో మందమర్రిలో కార్మిక కుటుంబాలు ఆయన మరణ వార్త విని కన్నీళ్ల పర్యాంతమయ్యారు.

రక్త పింజర కాటేడయంతో శ్రీనివాస్ మృతి..!

శ్రీనివాస్ ఈనెల 24నాడు సింగరేణి గ్రీన్ పార్కులో హరితహారం కోసం మొక్కలు తీస్తుండగా  అందులో ఉన్న రక్త పింజర పాము కరిచింది,వెంటనే కరీంనగర్ లో ఉన్న దవాఖాన్లకు తీసుకెళ్లారు,అక్కడ చికిత్స పొందుతూ మరణించారు. ఆయనకు భార్య కృష్ణవేణి, కూతుళ్లు స్వాతి, అంజలి ఉన్నారు.ఖమ్మంలో జరిగిన ఓ సంఘటన శ్రీనివాస్ పాములు పట్టే వృత్తిలో చేరడానికి కారణమైంది.

ఖమ్మంలోని ఓ కుటుంబం నిద్రిస్తుండగా మెత్తలో ఉన్నపాము కాటేయడంతో నలుగురు కుటుంబ సభ్యులు మరణించారు  ఆ సంఘటన శ్రీనివాస్ ను చాలా కలచి వేసింది,అప్పుడే తను పాములు పట్టాలని నిర్ణయించుకున్నాడు.

శ్రీనివాస్ గత 10 సంవత్సరాలుగా పాములు పడుతూనే ఉన్నాడు ,ఇప్పటివరకు దాదాపు 6000 పాముల పట్టాడట,ఎక్కడ పాము పట్టినా కూడా శ్రీనివాస్ ఒక్కరూపాయి కూడా తీసుకునే వాడు కాదట,కేవలం బండి పెట్రోల్ ఛార్జీలకు మాత్రమే తీసుకునే వారట,తనకు తెలిసిన విద్యను పది మందికి పంచాలనే ఉద్దేశంతో స్నేక్‌ సొసైటీని ఏర్పాటు చేసి సింగరేణి ప్రాంతాల్లోని పలువురు యువకులకు శిక్షణ సైతం ఇచ్చారు.కానీ ఇలా ఈరోజు అదే పాము కాటుకు బలికావడం అందరిని భాదపెడుతుంది.