Snake stuck in woman's ear.. Here is the video
mictv telugu

మహిళ చెవిలో ఇరుక్కుపోయిన పాము..వీడియో ఇదిగో

September 12, 2022

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వీడియోను వీక్షిస్తున్నవారందరు ఒక్కసారిగా షాక్‌ అవుతున్నారు. మహిళ చెవిలోకి పాము ఎలా దూరింది? పాము ఎలా ఇరుక్కుపోయింది? అంత పొడవుగా ఉండే ఆ విష సర్పం చెవిలో ఎలా పట్టింది? అనే అనుమానాలు నెటిజన్స్‌లో రేకెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. వైరల్ అవుతున్న వీడియోలో ఈ ఘటన ఎక్కడ జరిగింది? అనే పూర్తి వివరాలైతే తెలియదు. కానీ, వీడియో మాత్రం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. వీడియోలో..”ఒక పాము మహిళ చెవిలో ఇరుక్కుపోయి ఉంటుంది. ఆ పామును తీసేందుకు డాక్టర్ శతవిధాల ప్రయత్నిస్తుంటాడు. పాపం వైద్యుడు చేతికి గ్లోవ్స్ ధరించి, చెవి నుంచి పామును తొలగించే రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ ఆ వీడియోలో చివరకు పాము చెవి నుంచి బయటకు వచ్చిందో లేదా అనేది సస్పెన్స్ లో ఉండిపోతుంది”.

అయితే, ఈ వీడియోని చందన్ సింగ్ అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. ‘పాము చెవి లోపలికి వెళ్లింది’ అనే క్యాప్షన్‌ పెట్టాడు. ఇప్పటికే ఈ వీడియోకి 80 లక్షలకు పైగా వ్యూస్ రాగా, దాదాపు 100 లైక్‌లు వచ్చాయి. కానీ, నెటిజన్లు మాత్రం ఇది నిజంగా జరిగిన ఘటన కాదని, ఈ వీడియో నకిలీది అంటూ కొట్టిపారేశారు.