ఈ పోరగాళ్లకు పాములే భయపడతాయ్..! - MicTv.in - Telugu News
mictv telugu

ఈ పోరగాళ్లకు పాములే భయపడతాయ్..!

June 28, 2017

గదేదో సిన్మల పుట్టల శెయ్యివెట్టి రజినీకాంత్ ఒక్క పామును స్టైల్ దియ్యంగనే సీటీల మీద సీటీలు కొట్టిన్రు గదా మరి గీ వీడియోల పోరగాన్లను జూడున్ని…సీటీలు గొట్టుడు గాదు,ఆ..అని నోరెళ్ల వెడ్తరు.ఓర్నాయనో అని ఆళ్ల దైర్యానికి సలాం కొడ్తరు.పాముల్ను జూశి మన్షులు ఉర్కుడు జూశినం గనీ ఆ పోరలను జూశి పాములే  పొక్కలల్లకు ఉర్కుతున్నయ్, అవి పాములన్కుంటున్రో  లేక్పోతే తాడులన్కుంటున్రో గనీ పొక్కలల్ల దాక్కున్న పాములనుగుడ శెయ్యివెట్ఠి బైటకు గుంజి మంచిగ తాడులెక్క గిరా గిరా తిప్పి సంచులేస్తున్నరు.

గట్టిగ పదేండ్లు గుడ లేని ఈపోరగాళ్లది  కాంబోడియా దేశం…పాపం ఇల్లుగడ్వనీకనీ  పాములను వడ్తున్రు.పట్టిన పాములన్నిట్ని ఓ సంచుల నింపి బజార్ల బీరకాయలు పొట్లకాయలు అమ్మినట్టు పాములను అమ్ముతరట,ఇగ అచ్చిన పైసలతోని ఇంట్లకు కావల్సిన వస్తువుల్ను కొన్కుంటరట,ఈళ్లే గాదు అక్కడ శానమంది పరిస్థితి ఇంతేనట…శేతిలో సంచి..రొండు కట్టెలు వట్కొని శెట్లెంబట పుట్టలెండట తిర్గుతరట…సంచినిండెటియన్ని పాములు కన్పియ్యక పోతయా అని ఆశతోని పొక్కలల్ల ఒర్రెలపొంటి శెయ్యిలు వెట్కుంట లెంకుతరట,వామ్మో శెప్తుంటనే పానం గజ్జుమంటుంది గదా.మరి ఆళ్లకు కర్వాయా అంటే కరుస్తయ్ అయినా బుగులు వట్టరు,ఒకవేళ కర్శిన ఏం గాకుంట ఎమన్న మందులు మాకులు తింటరో ఏంపాడో…అంత శిత్రమన్పిస్తున్నది.

కనీ మనకు ఏడనన్న బుడ్డ పాముగిట్ల కన్పిస్తేనా  నాసామిరంగ ఊరంత ఒక్కటిజేశి  గజ్జున అన్కుతం,కొందరికైతె సల్ల శెమ్టలు వుడ్తయ్,ఇగ శిన్న పోరగాళ్లైతె లాగులు తడ్పుకునుడు గ్యారంటీ,అగో పామంటే మనకు గంత భయం,కనీ గీ పోరగాన్లు జూశి పత్తలేకుంట పారిపోతున్నయంటే సూడిన్రి ఆళ్లెంత తీస్మార్లాన్లో… కోళ్లను శాపల్ను వట్టినంత అల్కగ  పాముల్ను వడ్తున్రంటే ఆళ్ల దైర్యానికి దండం పెట్టాల్సిందే.