పిల్లపాములు కాలనాగులా బుసలు కొట్టడాన్ని చూశారా? - MicTv.in - Telugu News
mictv telugu

పిల్లపాములు కాలనాగులా బుసలు కొట్టడాన్ని చూశారా?

June 21, 2017

పాము పగ పడుతుందంటారు. నిజమో కాదో కానీ… తల్లి పాముని చంపడాన్ని చూసి పిల్లపాములు బుసలు కొట్టాయి. పడగవిప్పి కాటేయడానికి కాస్కోని కూర్చున్నాయి. ఏపీలోని చిత్తూరు జిల్లా, రాయలపేట పంచాయతీ దిన్నిపల్లెలో ఇది జరిగింది. ఓ తోటలో తిరుగుతన్న భారీ నాగుపామును కూలీలంతా కలిసి చంపేశారు.

తల్లినాగును చంపేసిన కాసేపటికే ఆ నాగు దగ్గరకు పిల్లపాములు ఒక్కొక్కటిగా వచ్చాయి. వచ్చిన ప్రతి పిల్లపాము పగడ విప్పి తల్లిపాముపై అటూ ఇటూ తిరిగాయి. ఈ ఘటనను చూసేందుకు స్థానికులు తరలి వచ్చారు. చివరికి పిల్ల పాములకు ఎలాంటి హానీ తలపెట్టకుండా స్థానికులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.