Snap elections for Andhra Pradesh assembly elections
mictv telugu

ఏపీలో ముందుస్తు ఎన్నికలు.. సజ్జల చెప్పేశాడు..

May 7, 2022

Snap elections for Andhra Pradesh assembly elections

విపక్షాల దాడి తీవ్రంగా ఉన్నప్పుడు, ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పుకోడానికి అధికార పార్టీలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం పరిపాటి. ఇవే కాకుండా మరికొన్ని బైటికి చెప్పని కారణాలు కూడా ఉండొచ్చు. కారణం ఏమైతేనేం, ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు అధికారికంగానే సంకేతం వెలువడింది. ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్తున్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు.

ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘ఏడాది, రెండేళ్లలో ఎన్నికలకు వెళ్లబోతున్నాం. జగన్ ప్రభుత్వ పనితీరు ప్రజల్లోకి బాగా వెళ్లింది. మా పథకాలు విజయవంతమయ్యాయి’ అని అన్నారు. నిజానికి ఏపీలో ఎన్నికలకు రెండేళ్ల గడువుంది. ఆ విషయం అందరికీ తెలిసిందే అయినా సజ్జల ప్రత్యేకంగా చెప్పడం వెనక ఏదో కారణం ఉండే ఉంటుందని భావిస్తున్నారు. ఏపీలో ఆర్థిక సంక్షోభం, ఇతరత్రా సమస్యలు ఎదుర్కొంటున్న జగన్.. వాటి నుంచి బయటపడి, ప్రజలు తమవైపే ఉన్నారని చెప్పడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. అవి అబద్ధమని వైకాపా శ్రేణులు తోసిపుచ్చినా సజ్జలే స్వయంగా చెప్పడం ఆసక్తి రేకెత్తిస్తోంది.