సౌత్ క్యూట్ కపుల్ నటి స్నేహ, ప్రసన్నలు చిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న జంటలలో ఒకరు. వీరిద్దరి పెళ్లి పదేళ్లు దాటింది. అయితే పెళ్లి తరువాత ఆచితూచి సినిమాలు చేస్తున్న ఈ జంట కమార్టియల్ యాడ్స్ లో కలిసి నటిస్తుంటారు. తమ జీవితంలోని ప్రత్యేక క్షణాలను సోషల్ మీడియాలో వారి భారీ అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉంటారు. అలాంటి ఈ జంటపై మీడియాలో గత కొద్దీ రోజులుగా విపరీతమైన పుకార్లు వస్తున్నాయి. మనస్పర్థల కారణంగా స్నేహ భర్త ప్రసన్నతో విడాకులకు సిద్ధమైనట్టు వార్తలొస్తున్నాయి. స్నేహ చాలా రోజుల నుండి తన భర్తకు దూరంగా ఉంటుందని, ఫ్యామిలీ గొడవల కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య మనస్పర్ధలు వచ్చి దూరం పెరిగిందని తెలుస్తోంది.
అందువల్లనే స్నేహ తన భర్త ప్రసన్నకు దూరంగా తన పిల్లలను తీసుకొని వేరే ఇంట్లో ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ పుకార్లపై స్నేహ ఇప్పటివరకు స్పందించకపోవటంతో ప్రజలు బలంగా నమ్మటం మొదలుపెట్టారు. దీంతో తాజాగా ఈ రూమర్స్ కి నటి స్నేహ చెక్ పెట్టింది. స్నేహా తన సోషల్ మీడియాలో తన భర్త ప్రసన్నతో కలిసి కనిపించే ఒక చిత్రాన్ని షేర్ చేసి.. విడాకుల ఊహాగానాలపై ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చింది. స్నేహ షేర్ చేసిన ఫొటోలో.. స్నేహ, ప్రసన్నలు ఒక అందమైన సెల్ఫీ కోసం పోజులివ్వడాన్ని చూడవచ్చ. ఇక ఈ పిక్ చూసిన స్నేహ ఫ్యాన్స్ ఊపిరిరి పీల్చుకున్నారు. చాలామంది జంటల్లా తమ అభిమాన తార విడాకులు తీసుకోవటం లేదని ఆనందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
రాజమౌళి సర్ మిమ్మల్ని చంపేయొచ్చు..సెక్యూరిటీ పెంచుకోండి..
అక్కినేనిపై బాలయ్య వివాదాస్పద కామెంట్స్.. ఘోరంగా ట్రోల్ చేస్తున్న అభిమానులు
బాలయ్యకు ఇచ్చి పడేసిన అక్కినేని వారసులు