Sneha away from her husband prasanna
mictv telugu

భర్తకు దూరంగా హీరోయిన్ స్నేహ..కారణమదే..

November 10, 2022

Sneha away from her husband prasanna

అందాల తార స్నేహ వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. తన భర్తతో స్నేహ దూరంగా ఉంటున్నారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్థులు కారణంగా గత కొన్ని రోజులుగా వీరు విడివిడిగా ఉంటున్నారని పుకార్లు గుప్పుమంటున్నాయి.

హీరోయిన్ స్నేహ.. నటుడు ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంట్లోవారికి ఇష్టంలేకపోతే బలవంతంగా ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు.పెళ్లైన నుంచి చాలా సంతోషంగా ఉన్న ఈ జంటను చూసి అంతా ఆనందపడ్డారు. అంతే కాదు సోషల్ మీడియాలో, పలు సందర్భాలలో ఫ్యామిలీ ఫోటోలతో సందడి చేసారు. ఇప్పుడు వీరిద్దరు కలిసి లేరన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగా స్నేహ ప్రసన్నల మధ్య దూరం పెరిగిందని ..ఈ కారణంగానే మాట మాట పెరిగి స్నేహ, ప్రసన్నకు దూరంగా వేరే ఇంట్లో ఉంటుందని తెలుస్తుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే వీరి గొడవ ఎంతవరకు వెళ్తాది అన్నదానిపై అభిమానులు టెన్షన్ పడుతున్నారు.తొందరగా కలిసిపోయి హ్యాపీ జీవించాలని కామెంట్స్ చేస్తున్నారు.

తమిళ, తెలుగు, మలయాళ చలన చిత్రాల్లో నటించిన అతికొద్ది మంది నటీమణులలో స్నేహ ఒకరు. ఆమె ‘హోమ్లీ పాత్రలు’ తో దక్షిణ భారత ప్రేక్షకులందరినీ ఆకర్షించారు. తెలుగులో తొలివలపు, ప్రియమైన నీకు, వెంకీ, రాధాగోపాళం, సంక్రాంతి, మధుమాసం, శ్రీరామదాసు, పాండురంగడు మొదలగు చిత్రాలలో నటించి అలరించింది. s/o సత్యమూర్తి, వినయ విధయ రామ చిత్రాల్లోను తన నటనతో ఆకట్టుకున్నారు స్నేహ.