పీతల పిచ్చి.. దీన్ని రూ. 3.26 లక్షలకు కొన్నాడు..  - MicTv.in - Telugu News
mictv telugu

పీతల పిచ్చి.. దీన్ని రూ. 3.26 లక్షలకు కొన్నాడు.. 

November 11, 2019

పీతల రుచి మామూలుగా ఉండదు. కానీ అవి తక్కువ సంఖ్యలో దొరకడంతో ధర పైనే ఉంటుంది. మనకు రకాన్నిబట్టి కేజీ రూ. 400 నుంచి దొరకుతాయి. విదేశాల్లోనూ వీటి ధర ఎక్కువే. అరుదైన పీతల వ్యాపారం అ‘ధర’హో అన్నట్లు సాగుతుంటుంది. ముఖ్యంగా సముద్ర ఆహారంపై మక్కువ చూపే జపాన్‌లో అరుదైన పీతలు ఎంత ధర పలుకుతాయో చెప్పే వార్త ఇది. 

Snow crab.

1.2 కేజీల బరువు ఉన్న పీత ఒకటి రూ. 3.26 లక్షలకు అమ్ముడుబోయింది. దీని పొడవు 15 సెంటీమీటర్లు. స్నో క్రాబ్ జాతికి చెందిన ఈ పీతను తొటోరీ ప్రాంతంలో వేలం వేశారు. ఏటా పీతల సీజన్ మొదలు కాగానే ఇలాంటి వేలాలు సాగుతుంటాయి. చేపలు, పీతలతోపాటు, పుట్టగొడుగులు, పుచ్చకాయలువంటి వాటినీ వేలం వెర్రితో కొంటుంటారు. గత ఏడది కూడా ఓ పీతను రూ. 1.3 లక్షలకు ఎగరేసుకుపోయారు. అత్యంత ఖరీదైన పీతగా అది సాధించిన గిన్నిస్ బుక్ రికార్డును తాజా స్నో క్రాబ్ పీత బద్దలు కొట్టింది.