So many crores for a 'garbage' bag!.. Here are the photos
mictv telugu

‘చెత్త’ వేసే బ్యాగ్‌కు ఇన్ని కోట్లా!..ఫోటోలు ఇవిగో

August 17, 2022

ప్రస్తుతం నెట్టింట ఓ ‘చెత్త’ వేసే బ్యాగుకు సంబంధించిన వార్త, ఫోటోలు హాట్ టాఫిక్‌గా మారాయి. ఆ బ్యాగ్ ఖరీదు తెలిసి అందరు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ఇంత ఖరీదైన బ్యాగ్‌లో విశేషం ఏముంది? అని తెగ ఆరా తీస్తున్నారు. ఇంతకీ ఆ చెత్త వేసే బ్యాగు ఏంటీ? దాని ఖరీదు ఎంత? అనే వివరాలను తెలుకుందాం..

సామాన్యంగా మన ఇంట్లో ఉన్న చెత్తను పడేయడానికి నలుపు రంగులో ఉండే ప్లాస్టిక్ పాలిథిన్‌ని వాడతాం లేదా ఏదైనా కవర్‌లో చెత్తను ఎత్తి బయట పారవేస్తాం. వాటి ధర మహా అయితే, యాభై నుంచి వంద రూపాయలోపు ఉంటుంది. కానీ, ఫ్యాషన్ హౌస్ అనే సంస్థ విడుదల చేసిన ఓ చెత్త బ్యాగు ట్రెండ్ సృష్టిస్తుంది.

ఆ బ్యాగు ధర లక్షల్లో ఉంది. దీనిని ‘ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చెత్త బ్యాగ్’ గా పిలుస్తున్నారు. దీని ధర ఐదు వందలో, వెయ్యి రూపాయలో కాదు, 1,790 డాలర్లు అంటే దాదాపు 1 లక్షా 42 వేల రూపాయలు.

ఈ విషయం తెలిసి, చాలామంది మైండ్‌ బ్లాంక్‌ అయినంత పని అవుతుంది. ఇంత ధర ఉంటే ఎవరైనా తీసుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఖరీదైన ‘ట్రాష్ బ్యాగ్’ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.