సబ్బు, సర్ఫులకు రెక్కలు..ఇది కూడా యుద్ధం పుణ్యమే - MicTv.in - Telugu News
mictv telugu

సబ్బు, సర్ఫులకు రెక్కలు..ఇది కూడా యుద్ధం పుణ్యమే

March 31, 2022

sabbu

ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం మొదలైన రోజు నుంచి నేటీవరకు దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, చికెన్, వంటనూనె, గ్యాస్, ఫారసెటమాల్ ధరలు కొండెక్కాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో గురువారం హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీలు వినియోగదారులకు షాక్‌నిచ్చాయి. తమ కంపెనీలో తయారయ్యే సబ్బులు, డిటర్జెంట్ల ధరలను పెంచుతున్నామని ప్రకటించింది. వీటి ధరలను 3-5 శాతం మేర పెంచుతున్నామని వెల్లడించింది. వీటితోపాటు సర్ఫెక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పేర్స్, హమామ్, లిరిల్, రెక్సేనా వంటి సబ్బుల ధరలు కూడా పెరగబోతున్నాయని పేర్కొంది.

అయితే, తాజాగా పెంచిన ధరల ప్రకారం.. సర్ఫెక్సల్ డిటర్జెంట్ కేజీ రూ. 130 నుంచి 134కు పెరిగింది. లక్స్ సోప్ (100 గ్రాములు x4)ఏకంగా 6. 66 శాతం పెరిగి రూ. 180కి చేరింది. పియర్స్ (75 గ్రాములు 3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ. 185కి చేరింది. కొన్ని వారాల క్రితమే సబ్బులు, డిష్ వాష్ ఉత్పత్తుల ధరలను పెంచిన హెచ్‌యూఎల్.. ఇటీవలే బ్రూ కాఫీ, టీ పొడి ధరలను సవరించింది.