ప్రపంచ జనాన్ని ఏకం చేస్తున్న ఫేస్బుక్ ఆయా దేశాల్లో తన మార్కెట్ విస్తరణపై మరింత శ్రద్ధపెట్టింది. ఎట్టకేలకు ఇండియా విభాగానికి అధిపతిని నియమించింది. హాట్‌స్టార్ వ్యవప్థాపకుడు అజిత్ మోహన్‌ను ఎండీ, వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్టు కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
మోహన్ వచ్చే ఏడాది ఆరంభంలో బాధ్యతలు స్వీకరిస్తారు. నెట్ న్యూట్రాలిటీ వివాదాలు, సొంత వ్యాపారం ప్రారంభం తదితర కారణాలతో ఉమాంగ్ బేడీ ఫేస్బుక్ ఇండియా ఎండీ వదిలాక ఏడాది తర్వాత మోహన్‌ను నియమించారు. మోహన్ 2016 ఏప్రిల్ నుంచి స్టార్ ఇండియా ఆన్లైన్ వీడియో ప్లాట్‌ఫాంకు, హాట్‌స్టార్‌కు సీఈవోగా పనిచేశారు. ఫేస్బుక్ ఎండీగా మోహన్ భారత దేశంలో కంపెనీ విస్తరణకు వ్యూహాలు రచిస్తారు. పెట్టుబడుల వ్యవహారాలనూ చూస్తారు. ఎంతో అనుభమున్న మోహన్ తమ కంపెనీని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నట్లు ఫేస్ బుక్ తెలిపింది.