ఫేస్‌బుక్ పే..డబ్బు చెల్లింపుల ఆప్షన్ వచ్చేసింది - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ పే..డబ్బు చెల్లింపుల ఆప్షన్ వచ్చేసింది

November 13, 2019

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ఆన్‌లైన్ చెల్లింపుల రంగంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికే గూగుల్, ఆపిల్ వంటి ఎన్నో సంస్థలు డిజిటల్ పేమెంట్స్‌లో దూసుకుపోతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఫేస్‌బుక్ కూడా ఆ జబితాలో వచ్చి చేరింది. ఫేస్‌బుక్ పేను ప్రస్తుతానికి అమెరికాలో అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు సులువైన, సురక్షితమైన చెల్లింపులు జరపడానికి వీలుగా తాము ఈ సేవను ప్రారంభిస్తున్నామని ఫేస్‌బుక్ ప్రకటించింది. 

Facebook.

దీనిని ఉపయోగించి కొనుగోళ్లు, చెల్లింపులతో పాటు విరాళాలు, నగదు లావాదేవీలను కూడా చేసుకోవచ్చని ఫేస్‌బుక్ పేర్కొంది. ఈ సేవలను ఫేస్‌బుక్‌లో మాత్రమే కాకుండా ఫేస్‌బుక్ అనుబంధ సంస్థలైన మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్‌లలో కూడా వినియోగించుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం దీనిని వాడటానికి ఫేస్‌బుక్ ఖాతా ఉండటం తప్పనిసరి. మీ ఫేస్‌బుక్ ఖాతాలోని సెట్టింగ్స్‌లోకి అక్కడ ఫేస్‌బుక్ పే అనే ఆప్షన్‌ని సెలక్ట్ చేయాలి. తరువాత పేపాల్, లేదా మీకు ఇష్టమైన ఇతర చెల్లింపు విధానాన్ని ఎంచుకోని దీనిని వినియోగించవచ్చు. ఫేస్‌బుక్ పే అన్ని బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డులతో, పేపాల్‌తో కూడా పనిచేస్తుంది.