ఫేస్‌బుక్ ఎక్కువగా చూస్తోందని భార్యను చంపేశాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

ఫేస్‌బుక్ ఎక్కువగా చూస్తోందని భార్యను చంపేశాడు..

January 21, 2020

wife lost life.

సోషల్ మీడియాతో మంచితోపాటు చెడు కూడా భారీగానే జరుగుతోంది. భార్య తనను పట్టించుకోకుండా పొద్దస్తమానం ఫేస్‌బుక్‌తో గడిపేస్తోందని ఆగ్రహించిన యువకుడు ఆమెను దారుణంగా హత్య చేశాడు. రాజస్తాన్‌లోని రాంగఢ్ మోద్’లో ఈ ఘోరం జరిగింది. 

అయాజ్ అహ్మద్ అన్సారీ(26), నైనా మంగ్లానీ(22) ప్రేమించి మతాంతర పెళ్లి చేసుకున్నారు. ఒక బిడ్డ కూడా ఉన్నాడు. హాయిగా సాగుతున్న కాపురంలో ఫేస్ బుక్‌తో గొడవ మొదలైంది. నైనా ఎక్కవగా ఫేస్‌బుక్ వాడడం అతనికి నచ్చలేదు. ఆమెకు 6 వేల మంది ఫాలోవర్లు ఉండడం కూడా దీనికి కారణమైంది. ఆమెకు ఎవరితోనే సంబంధముందని అయాజ్ అనుమానించాడు. దీంతో గొడవ జరిగింది. నైనా పుట్టింటికి వెళ్లిపోయింది. తనను వేధిస్తే విడాకులు ఇచ్చేస్తానని నైనా బెదిరించింది. అయాజ్ ఆదివారం ఆమె ఇంటికొచ్చాడు. రాజీకొద్దామని నచ్చజెప్పారు. నైనా అమాయకంగా నమ్మేసింది. అయాజ్ ఆమెకు బీర్ తాగించి స్కూటీలపై అమీర్ ల్స్ ప్రాంతానికి తీసుకళ్లాడు. అక్కడ ఆమెను గొంతు నులిమి చంపి, తలపై బండరాతితో మోది చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని అతణ్ని అరెస్ట్ చేశారు.