అతడు, ఖలేజా తరువాత… సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్.. హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో తర్వాత.. త్రివిక్రమ్ తో ఈమే కూడా హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమైంది. త్రివిక్రమ్ నెక్స్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిల్మ్ లో కూడా పూజానే హీరోయిన్ అని టాక్.
ఇకపోతే తాజాగా త్రివిక్రమ్.. పూజా హెగ్డేకు రెండు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ కారులోనే పూజా షూటింగ్స్ కు రానున్నదట. సినిమాలకు సంబంధించి హీరోయిన్లను సెట్స్‌కి తీసుకురావడానికి, మళ్లీ తీసుకెళ్లి హోటల్స్‌లో దింపడానికి.. అద్దె కార్లు అయితే భారీగా ఖర్చు అవుతుందని.. ఏకంగా ఒక కారునే (ప్రొడక్షన్ వాళ్లు)కొనేశారనేది తాజాగా టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.
దీనిని కొందరు.. పూజా హెగ్డేకు త్రివిక్రమ్ రెండు కోట్ల విలువ చేసే కారుని గిఫ్ట్‌గా ఇచ్చాడనేలా పుట్టించేశారు. అయితే ఇది పూజా హెగ్డే కోసం కొన్న కారు అయితే కాదని.. ఈ బ్యానర్స్‌లో ఇక ఏ హీరోయిన్ చేసినా.. ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు.. వారి కోసం ఈ కారు ఉంటుందనేది ప్రస్తుతానికి నడుస్తున్న వార్తలోని సారాంశం. మరి ఈ విషయంపై నిర్మాతలుగానీ, లేదంటే దర్శకుడు త్రివిక్రమ్‌గానీ స్పందించాల్సి ఉంది.