జగన్‌పై గలీజ్ పోస్ట్.. నల్గొండ వాసి అరెస్ట్  - MicTv.in - Telugu News
mictv telugu

జగన్‌పై గలీజ్ పోస్ట్.. నల్గొండ వాసి అరెస్ట్ 

August 29, 2019

Social Media Posts...

సోషల్ మీడియా పుణ్యమా అని రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఇలా ఎవరిపై పడితే వారిపై ఎవరుపడితే వారు ఇష్టం వచ్చిన పోస్టింగులు పెట్టేస్తున్నారు. ఇవి కొన్నిసార్లు విమర్శలకు దారి తీస్తున్నాయి. ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో ఇష్టం వచ్చినట్టుగా తమ అక్కసు వెళ్లగక్కడంతో ఊచలు లెక్కించే పరిస్థితికి దారితీస్తోంది. ఇలాగే సోషల్ మీడియాలో ఏపీ సీఎం జగన్‌పై అసభ్యకరంగా పోస్టులు పెట్టిన వ్యక్తిని కూడా తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.  

నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నవీన్ కుమార్ గౌడ్ తన ఫేస్‌బుక్ ఖాతాలో వైసీపీ నేతలపై విమర్శలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ అధినేత,ఏపీ సీఎం జగన్ పై కూడా అభ్యంతరకరంగా పోస్టు పెట్టాడు. దీంతో వనపర్తి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నవీన్‌ను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. నవీన్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు.  ఈ సందర్భంగా సోషల్ మీడియాను నియంత్రణలేకుండా వాడుతూ.. ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు, పోస్టులు పెడితే ఊచలు లెక్కించాల్సిందేనని పోలీసులు హెచ్చరిస్తున్నారు.