దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్! - MicTv.in - Telugu News
mictv telugu

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కరోనా పాజిటివ్!

August 10, 2020

Minister ktr inaugurates flyover...

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దూకుడు పెంచాడు. వరుసగా సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. థియేటర్లు బంద్ ఉండడంతో ఆర్జీవీ వరల్డ్ అనే వెబ్ సైట్ ఓపెన్ చేసి అందులో తన సినిమాలను విడుదల చేస్తూ పర్ వ్యూ ఇంత అని డబ్బులు వసూల్ చేస్తున్నాడు. ఇప్పటికే ‘క్లైమాక్స్’, ‘నేకేడ్’, ‘పవర్ స్టార్’ వంటి సినిమాలను అందులో విడుదల చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ‘కరోనా’, ‘మర్డర్’, ‘అల్లు’, ‘అర్ణబ్’ వంటి సినిమాలను తెరకెక్కిస్తున్నాడు. ఆదివారం రోజున ‘డేంజరస్’ అనే మరో సినిమాను ప్రకటించాడు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఒక లెస్బియన్ క్రైమ్ యాక్షన్ లవ్ స్టోరీ అని వర్మ తెలిపాడు.

తాజాగా వర్మ గురించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. వర్మ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడని, ఆయనతో కలిసిన వారికి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ ఆ ప్రచార సారాంశం. దీంతో వర్మకు కరోనా సోకిందని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కొన్ని మీడియా సంస్థలు ఈ మేరకు వార్తలు కూడా రాశాయి. దీనిపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను… బహుశా ఈ వార్త అబద్ధం అయినందుకు వాళ్ళు చాలా బాధపడి ఉంటారని వర్మ తెలిపాడు. భవిష్యత్తులో వాళ్ళ కోరిక నెరవేరాలని ఆశిస్తున్నాను అని వర్మ అన్నాడు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను విడుదల చేశాడు. అందులో వర్మ జిమ్ లో ఉండి డంబెల్స్ తో కసరత్తు చేస్తున్నాడు.