ఇకపై ఫేస్‌బుక్ లోనే వార్తలు! - MicTv.in - Telugu News
mictv telugu

ఇకపై ఫేస్‌బుక్ లోనే వార్తలు!

August 11, 2019

social media site Facebook.

ప్రపంచ ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా మరో కొత్త ఫీచర్‌ను అందించేందుకు సిద్దమైనది. ఫేస్‌బుక్‌లోనే వార్తల్ని అందంచే దిశగా ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. దీనికోసం ఫేస్‌బుక్‌లోని ప్రధాన ఫీచర్లు న్యూస్‌ఫీడ్‌, మెస్సెంజర్‌, వాచ్‌తో పాటు న్యూస్‌ అనే ప్రత్యేక ఫీచర్‌ని జోడించనున్నారు. 

ఈ మేరకు ఫేస్‌బుక్ సీఈవో మార్క్‌ జూకర్‌బర్గ్‌ అమెరికాలోని ప్రముఖ వార్తా సంస్థల్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. లైసెన్స్‌ కోసం ఆయా సంస్థలకు 3మిలియన్ డాలర్లు చెల్లించడానికి కూడా సిద్ధమైనట్లు సమాచారం. అంతా సజావుగా సాగితే.. వచ్చే సంవత్సరం తొలుత ఈ ఫీచర్‌ని అమెరికా యూజర్లకు అందించనున్నట్లు సమాచారం. సమాచారం కోసం ఆయా వార్తాసంస్థలకు ఫేస్‌బుక్‌ భారీగా డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ.. వినియోగదారులకు మాత్రం ఉచితంగానే అందించనున్నట్లు తెలుస్తోంది.